స్వాతంత్య్ర సంబురం

Thu,August 15, 2019 11:51 PM

-మార్కెట్ యార్డులో అంబరాన్నంటిన వేడుకలు
-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి
-హాజరైన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు సక్కు, కోనేరు కోనప్ప, ఎస్పీ మల్లారెడ్డి
-అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
-ప్రభుత్వ ఆస్తుల పంపిణీ.. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు..

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ జెండా ఎగరేశారు. అంతకుముందు ఆమె పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనే రు కోనప్ప, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీమల్లారెడ్డి, జేసీ రాంబాబు హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు తిలకించారు.

శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి మంజూరైన ఆస్తులను లబ్ధిదారులకు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా న్యాయస్థానంలో న్యాయమూర్తి నారాయణ బాబు, సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి రామారావు, ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీవో కృష్ణాదిత్య జెండా ఎగరేశారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles