స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి

Sat,August 17, 2019 12:33 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: ఆదిమ కొలాం, తోటి, మన్నెవార్ గిరిజన యువతీ యువకులకు ఉన్నత చదువుల స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏటీడీఏ సం గీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, నర్సిం గ్, ఇతర విద్యార్థులు గిరిజన సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. కొలాం, తోటి, మన్నెవార్ ఉప కులాలకు సంబంధించిన ఎస్టీలు ఉండాలనీ, స్థానిక ధ్రువీకరణ పత్రం జతచేయాలని సూచించారు. కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అర్హత కల్పించడం, జూలై 1 నాటికి 35 ఏళ్లు దాటరాదని పేర్కొన్నారు. వి ద్యార్థి భారతీయుడై ఉండాలి, మీసేవ ద్వారా పీటీజీ సర్టిఫికెట్, జన్మ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, స్టడీ, బొనొఫైడ్, కోర్సు ప్రవేశ కాపీ, బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ, కల ర్ ఫొటోలతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles