చికిత్స పొందుతూ యువకుడి మృతి

Sat,August 17, 2019 01:33 AM

జూలూరుపాడు : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నాలుగురోజులుగా చికిత్స పొందుతున్న మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన దుగ్గిన్ని బాలకృష్ణ(25)శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాలకృష్ణ ఆత్మహత్యాహత్నానికి పాల్పడ్డ విషయం పాఠకులకు విధితమే.ఈ నేపథ్యంలో నాలుగు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మరణించాడు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles