పల్లె ఆరోగ్యానికి భరోసా

Sat,August 17, 2019 01:48 AM

-త్వరలో విలేజ్ హెల్త్ ప్రొఫైల్ పేరిట సర్కారు సరికొత్త కార్యక్రమం
- గ్రామాల వారీగా వైద్య శిబిరాలు
- ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై సర్వే..
- ప్రభుత్వానికి పూర్తి నివేదికలు
-భవిష్యత్‌లో వైద్య సేవల విస్తరణకు కీలకమయ్యే అవకాశం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లె ప్రజల ఆరోగ్యంలో విలేజ్ హెల్త్ ప్రొఫైల్ కీలకం కానున్నది. జిల్లాలోని 15 మండలాల్లో 13 మండలాలు దాదాపు గిరిజనులు నివసించే ప్రాంతాలే. ఏటా ఈ ప్రాంతాల్లో సీజన్ వ్యాధులతో పాటు, కిడ్నీ, కీళ్ల, కంటి సంబంధమైన వ్యాధులు, రక్తహీనతవంటివి వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే అనేక గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. సీజనల్ వ్యాధులతోపాటు, దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులకు గల కారణాలను వైద్య అధికారులు గుర్తించనున్నారు. విలేజ్ హెల్త్ ప్రొఫైల్ పేరిట వైద్య శిబిరాలు నిర్వహించి.. గ్రామాల వారీగా ప్రజల ఆరోగ్య విషయ సూచికను తయారు చేయనున్నారు. దీనినిబట్టి ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనా వేస్తారు. ఆయా ప్రాంతాల్లో తరుచుగా వస్తున్న రోగాలకు చేయాల్సిన చికిత్సలతో పాటు, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉం టుంది. దీంతో పాటు ఆయా గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సమాచారం వైద్యశాఖకు ఎంతో ఉపయోగపడనున్నది. విజేల్ హెల్త్ ప్రొఫైల్ పేరిట సుమారు వంద రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పల్లెల ఆరోగ్యంపై కీలక సమాచారం సేకరించనున్నారు.
ఆరోగ్య సమాచారం సేకరణ
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 431 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా సుమారు 1100 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో లక్షా 20 వేల 420 కుటుంబాలు ఉండగా, 5 లక్షల 25 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణ ప్రాంతాలు అంతగా లేని ఆసిఫాబాద్ జిల్లాలో 83 శాతం మంది ప్రజలు.. అంటే సుమారు 4 లక్షల 30 వేల జనాభా గ్రామాల్లోనే ఉంది. అక్షరాస్యత అంతగా లేని ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యంపై ప్రజలు అంతగా శ్రద్ధ చూపని కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లోని విద్యార్థులపై గతంలో సర్వేలు చేపట్టింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అవసరాన్ని బట్టి వైద్య సహాయం అందిస్తున్నది. తాజా ప్రభుత్వం విలేజ్ హెల్త్ ప్రొఫైల్ పేరిట ప్రజల సంపూర్ణ ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నది. ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగాచేసి ఆ రోగ్య తెలంగాణ సాధించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో స్థానికంగా పనిచేసే ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీలతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని వినియోగించుకోనున్నారు.
ఊరూరా వైద్య శిబిరాలు
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రతి వైద్య శిబిరంలో రోజుకు 20 కుటుంబాల ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి.. సమాచారాన్ని సేకరిస్తారు. ఇలా గ్రామంలోని అన్ని కుటుంబాల సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించి గ్రా మాల వారీగా ఆరోగ్య నివేదికలను రూపొందించి ప్ర భుత్వానికి అందజేస్తారు. గ్రామాల్లో చేపట్టనున్న ప్ర త్యేక వైద్యశిబిరాల నిర్వహణ గురించి త్వరలోనే వై ద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించినప్పుడు ప్రజల ఆరోగ్య విషయంలో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొ ని వారిలో ఉన్న వ్యాధులను ఎలా గుర్తించాలనే అనే విషయాలతో పాటు, ఏయే విషయాలను గమనించి నమోదు చేసుకోవాలనే విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. దీర్ఘకాలికంగా బాధపడేవారికి ఎలాంటి వైద్యం అవసరం అనే సమాచారం సేకరించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఆరోగ్యంపై సేకరించే సమగ్ర సమాచారం భవిష్యత్‌లో వైద్య సేవల విస్తరణకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ ప్రొఫైల్ (ఆరోగ్య సూచి) ఎంతో ముఖ్యం కానున్నది.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles