ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయాలి

Sat,August 17, 2019 11:58 PM

-ఎన్‌ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నపూర్ణశర్మ
-గోలేటి గ్రామ పంచాయతీ సందర్శన
రెబ్బెన: గ్రామాభివృద్ది కోసం గ్రామ సర్పంచ్, సభ్యులు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి వాటిని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్‌ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నపూర్ణశర్మ సూచించారు. రెబ్బెన మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ గోలేటిని సందర్శించి పాలకవర్గ సమావేశం నిర్ణయించారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాభివృద్ధిలో ఎలా వినియోగించుకోవాలి అనే ఆంశం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలో చేపట్టబోయే పనులపై ముందుగా ప్రణాళికలు తయారు చేసుకొని, నిధుల వినియోగం పై అవగాహన ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడం ఎంత ముఖ్యమో, అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని సూచించారు.

గ్రామాభివృద్ధిలో నిధుల వినియోగం పై ప్రతి ఒక్క సభ్యుడూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డీఎల్‌పీఓ వెంకటయ్య, గోలేటి ఉపసర్పంచ్ బొదాసు దేవానంద్, కార్యదర్శి శంకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles