ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించం

Sat,August 17, 2019 11:59 PM

ఆసిఫాబాద్ నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులను ఏ మాత్రం సహించమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. శనివారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సభ్యులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యాచారాలు, ఇతర సంఘటనలపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలనీ, నిర్లక్ష్యం జరిగినట్లు దృష్టికి వస్తే జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సభ్యుల సలహా, సూచనల మేరకు పకడ్బందీ చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సంబంధిత శాఖల ద్వారా సంక్షేమ ఫలాలు అందేలా అధికారులకు సూచిస్తామన్నారు. అనంతరం సభ్యులు పలు డిమాండ్లతో కూడి న వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles