వ్యాన్ అసోసియేషన్ సమావేశం

Sat,August 17, 2019 11:59 PM

కాగజ్‌నగర్ టౌన్: పట్టణంలోని వ్యాన్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యాన్ అసోసియేషన్ నాయకులు ఆవుల రాజుకుమార్, మహ్మద్ మునీర్ మాట్లాడుతూ పేపర్ మిల్లు మూతపడడంతో లారీ, వ్యాన్‌ఓనర్స్, డ్రైవర్స్ ఓనర్స్ పూర్తిగా ఉపాధి లేక ఎంతగానో నష్టపోయారనీ, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో మిల్లు పునఃరుద్ధరణ జరుగడం సంతోషకరమన్నారు. మి ల్లు యజమాన్యం, లారీ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదంలో కాగజ్‌నగర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్‌బాబుపై నమోదు చేసిన పీడీయాక్టు కేసును తొలగించాలని విన్నవించారు. సమావేశంలో జమీర్‌హుస్సేన్, ఖాజామైనోద్దిన్, ఎస్‌కే తోఫిక్, జాఫర్ అహ్మద్ పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles