మత్స్య విప్లవం-4

Sun,August 18, 2019 12:02 AM

-జిల్లాలో నాలుగో విడత చేప పిల్లల పెంపకం షురూ
-కుమ్రం భీం ప్రాజెక్టులో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు
-జిల్లాలో నాలుగో విడత చేప పిల్లల పెంపకం షురూ
-కుమ్రం భీం ప్రాజెక్టులో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు
-ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి
-మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని కుమ్రం భీం, వట్టివాగు, జగన్నాథ్‌పూర్, చలిమెల (ఎన్‌టీఆర్‌సాగర్ వాగులతో పాటు 247 చెరువులు, కుంటల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతున్నది. గతేడాది కోటి 14 లక్షల చేప పిల్లలను జలాశయాల్లో వదలగా, ఈ ఏడాది కోటి 55 లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ. కోటి 25 లక్షలు ఖర్చు చేయనున్నది. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం ప్రాజెక్టులో స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబుతో కలిసి 80 వేల చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా జలాశయాలు, చెరువుల్లో ఈ నెలాఖరుకల్లా లక్ష్యానికి మేర చేప పిల్లలను వదలనున్నారు.

6237 టన్నుల ఉత్పత్తి..
జిల్లాలోని జలాశయాల్లో పోయనున్న 1.55 కోట్ల చేప పిల్లల ద్వారా 6237 టన్నులు ఉత్పత్తి సాధించాలనేది మత్స్యశాఖ లక్ష్యం. ఈ ఏడాది వర్షాలు స మృద్ధిగా కురిసి జలాశాయాలు, చెరువులు, కుం టలు నిండుకుండల్లాగా దర్శనమిస్తుండగా, ప్రభు త్వం సకాలంలో పిల్లల్ని అందించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులువని పలువురు చెబుతున్నారు. గతంతో పోల్చితే పంట ఉత్పత్తి చాలా మెరుగుపడి మత్స్యకారులకు ఆదాయం పెద్ద ఎత్తున పెరుగుతుందని చెబుతున్నారు. గతేడాది కోటి 14 లక్షల చేప పిల్లలను పెంచగా.. 4497 టన్నుల ఉ త్పత్తి వచ్చింది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా చేపల ఉత్పత్తి జరిగి మత్స్యకారులకు మంచి లాభాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

22 మత్స్యకార సంఘాలకు ఉపాధి..
కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు మత్స్యకారులకూ కొండంత అండగా నిలుస్తున్నది. జిల్లాలో సుమారు 1000 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. 22 మత్స్య సహకార సంఘాల్లో 920 మంది సభ్యులు ఉన్నారు. చేపల పెంపకం, విక్ర యం ద్వారా ఉపాధి లభిస్తోంది. గతంలో ఎక్కడి నుంచో చేప పిల్లలను తీసుకువచ్చి చెరువుల్లో పోసేవారు. అందులో నాసిరకం చేపలు చనిపోయేవి. ప్రస్తుతం చేప పిల్లలను ప్రభుత్వం వంద శాతం స బ్సిడీ కింద అందిస్తూ వారికి ఆర్థికంగా భారం పడకుండా ఆదుకుంటోంది. దీంతో వారికి ఎంతో మే లు జరుగుతోంది. జలాశయాల వద్ద కిలోకు రూ. 110 నుంచి రూ. 120 చొప్పున అమ్ముతున్నారు. వాటిని రూ. 140 నుంచి రూ. 150 వరకు బయట విక్రయిస్తుంటారు. దీని ద్వారా మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఈ రెండేళ్లలో సుమారు రూ. 25 కోట్లతో అనేక వసతులు కల్పించింది. మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడంతో పాటు చేపలను ప ట్టేందుకు వలలు, వాటిని అమ్ముకునేందుకు వాహనాలను ఇచ్చింది. 16 లగేజీ వాహనాలు, 5 సంచా ర వాహనాలతో పాటు సుమారు 300 మందికి మోపెడ్లు, వలలను, ఇతర సామగ్రిని అందించింది.ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి
-మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం

మత్స్య విప్లవం-4
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని కుమ్రం భీం, వట్టివాగు, జగన్నాథ్‌పూర్, చలిమెల (ఎన్‌టీఆర్‌సాగర్ వాగులతో పాటు 247 చెరువులు, కుంటల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతున్నది. గతేడాది కోటి 14 లక్షల చేప పిల్లలను జలాశయాల్లో వదలగా, ఈ ఏడాది కోటి 55 లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ. కోటి 25 లక్షలు ఖర్చు చేయనున్నది. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం ప్రాజెక్టులో స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబుతో కలిసి 80 వేల చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా జలాశయాలు, చెరువుల్లో ఈ నెలాఖరుకల్లా లక్ష్యానికి మేర చేప పిల్లలను వదలనున్నారు.

6237 టన్నుల ఉత్పత్తి..
జిల్లాలోని జలాశయాల్లో పోయనున్న 1.55 కోట్ల చేప పిల్లల ద్వారా 6237 టన్నులు ఉత్పత్తి సాధించాలనేది మత్స్యశాఖ లక్ష్యం. ఈ ఏడాది వర్షాలు స మృద్ధిగా కురిసి జలాశాయాలు, చెరువులు, కుం టలు నిండుకుండల్లాగా దర్శనమిస్తుండగా, ప్రభు త్వం సకాలంలో పిల్లల్ని అందించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులువని పలువురు చెబుతున్నారు. గతంతో పోల్చితే పంట ఉత్పత్తి చాలా మెరుగుపడి మత్స్యకారులకు ఆదాయం పెద్ద ఎత్తున పెరుగుతుందని చెబుతున్నారు. గతేడాది కోటి 14 లక్షల చేప పిల్లలను పెంచగా.. 4497 టన్నుల ఉ త్పత్తి వచ్చింది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా చేపల ఉత్పత్తి జరిగి మత్స్యకారులకు మంచి లాభాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

22 మత్స్యకార సంఘాలకు ఉపాధి..
కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు మత్స్యకారులకూ కొండంత అండగా నిలుస్తున్నది. జిల్లాలో సుమారు 1000 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. 22 మత్స్య సహకార సంఘాల్లో 920 మంది సభ్యులు ఉన్నారు. చేపల పెంపకం, విక్ర యం ద్వారా ఉపాధి లభిస్తోంది. గతంలో ఎక్కడి నుంచో చేప పిల్లలను తీసుకువచ్చి చెరువుల్లో పోసేవారు. అందులో నాసిరకం చేపలు చనిపోయేవి. ప్రస్తుతం చేప పిల్లలను ప్రభుత్వం వంద శాతం స బ్సిడీ కింద అందిస్తూ వారికి ఆర్థికంగా భారం పడకుండా ఆదుకుంటోంది. దీంతో వారికి ఎంతో మే లు జరుగుతోంది. జలాశయాల వద్ద కిలోకు రూ. 110 నుంచి రూ. 120 చొప్పున అమ్ముతున్నారు. వాటిని రూ. 140 నుంచి రూ. 150 వరకు బయట విక్రయిస్తుంటారు. దీని ద్వారా మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఈ రెండేళ్లలో సుమారు రూ. 25 కోట్లతో అనేక వసతులు కల్పించింది. మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడంతో పాటు చేపలను ప ట్టేందుకు వలలు, వాటిని అమ్ముకునేందుకు వాహనాలను ఇచ్చింది. 16 లగేజీ వాహనాలు, 5 సంచా ర వాహనాలతో పాటు సుమారు 300 మందికి మోపెడ్లు, వలలను, ఇతర సామగ్రిని అందించింది.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles