రేషన్‌బియ్యం పట్టివేత

Mon,September 16, 2019 12:36 AM

కాగజ్‌నగర్‌టౌన్: కాజిపేట్ నుంచి బల్లార్షాకు వెళ్లే రామగిరి ప్యాసింజర్ రైల్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రామగిరి ప్యా సింజర్ రైల్‌లో వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా రేషన్ బి య్యాన్ని తరలిస్తున్నట్లు తమకు తెలిసిన పక్కా సమాచారంతో కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సోదాలు చేయగా 100 బస్తాల్లో 40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని తెలిపారు. దాడుల్లో ఆర్‌పీఎఫ్ పోలీసులు మాన్‌సింగ్, ఆనంద్, రవికిశోర్, తదితరులు ఉన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles