ఓటమి.. గెలుపునకు నాంది

Wed,September 18, 2019 02:31 AM

ఆసిఫాబాద్ టౌన్ : ఓటమి గెలుపునకు నాంది అని జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. మంగళవారం స్థాని క గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ కార్యక్రమం ముగింపునకు సీనియర్ సివి ల్ జడ్జి కనక దుర్గతో కలసి హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో గె లుపోటములు సహజమమనీ, ఓటమిని గుణపాఠంగా చేసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యా ర్థి దశ కీలకమైనదనీ, చిన్న చిన్న తప్పులతో అమూల్యమైన భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దన్నారు. ఇష్ట పడి చదివితే ఎదుగుదల సాధ్యమన్నారు. బాలల హక్కులు, విధులు గుర్తించి నడుచుకోవాలన్నా రు. కోఆర్డినేటర్ లక్ష్మయ్య, ప్రిన్సిపాళ్లు రాజా రాం, సంతోష్, వీరస్వా మి, అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles