అదిరే.. వెదురు కళ

Wed,September 18, 2019 02:32 AM

-ఆకట్టుకునేలా మేదరుల కళాకృతులు
-నేడు ప్రపంచ వెదురు దినోత్సవం
కౌటాల: వెదురుతో అందమైన కళాఖండాలను తయారు చేస్తున్నారు జిల్లా మేదరులు. అడవి నుం చి తెచ్చిన వెదురుతో అనేక రకాల వస్తువులను తయారు చేసి, వాటిని అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గ్రామాల సమీపంలోని అడవిలో ని వెదురును తెచ్చి, దానిని సన్నని బద్దలుగా త యారు చేసి కుటుంబ సభ్యులంతా కలిసి వాటితో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు. వారసంతల్లో అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలోని కౌటాల, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), రె బ్బెన, బెజ్జూర్, వాంకిడి, దహెగాం, పెంచికల్‌పేట, ఆసిఫాబాద్ మండలాలను కలుపుకొని 304 మేదరి కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 283 కుటుంబాలు పూర్తిగా అటవీ సంపద అయిన వెదురు బొంగుల తయారీ వస్తువులపై ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. వీరు చాటలు, గంపలు, మొంటెలు, పెద్ద గంపలు, కోళ్ల గూళ్లు, దుర్గామాత(పెద్దదేవర) పూజకు ఉపయోగించే సామగ్రి, తడక లు, గుమ్ములు(వడ్లు, జొన్నలు దాచుకునే వస్తువు), సింగరేణిలో బొగ్గు తోడేందుకు ఉపయోగించే గం పలు, మోటర్ సైకిల్, గుడి ఆకారాలు, పూల బు ట్టలు, పూల స్టాండ్‌లు, ఫోటో ఫ్రేంలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల అందమైన కళాకృతులను తయారు చేసి వాటిని గ్రామాల్లో తెల్లవారు జామునే తిరుగుతూ అమ్మేవారు. అయితే రాను రాను ప్లాస్టిక్ వస్తువుల రాకతో మేదరులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది.

వెదురు వస్తువుల తయారీ విధానం..
వెదురు తెచ్చిన తరువాత బద్దలు(సన్నని పొరలుగా) దానిని ఏ వస్తువు తయారు చేయాలో దానికి అనుకూలంగా తయారు చేస్తారు. దాని తరువాత వె దురు బద్దలపై గరుకు లేకుండా కత్తితో దానిని నునుపుగా తయారు చేసి, గంపలు, చాటలు, అం చెలు, మొంటెలు, ఏ వస్తువు తయారు చేయాలో దాని వెడల్పు ఎంత ఉండాలో చూసుకుని బద్దలను తయారుగా పెడతారు. ఆ తరువాత కావలసిన వస్తువు అల్లికలు మొదలు పెడతారు. ఈ విధంగా ప్రతి వ స్తువు పూర్తిగా చేతితోనే తయారు చేస్తారు. వీటి త యారుకు ఎలాంటి మిషన్లను వాడకుండా పూర్తిగా చేతితోనే కావాల్సిన కళాకృతిని తయారు చేస్తారు. దీ నిని తయారు చేసిన మరుసటి రోజు సమీపంలోని వారసంతలకు తీసుకెళ్తారు.

ప్లాస్టిక్‌తో అనేక రకాల వ్యాధులు...
ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడు తున్నారు. వీటితో అనేక రకాల వ్యాధులు వ్యాపిం చడంతో పాటు పర్యావరణం కలుషితమవుతున్నద ని నిపుణులు చెబుతున్నారు. రాబోయే తరానికి భా రీ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ భూమిలో కూడా కరగకుండా కొన్నేళ్లపాటు అలాగే ఉంటుందనీ, దీం తో భూమి నుంచి కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయు వులు వెలువడే ప్రమాదం ఉన్నట్లు కూడా శాస్త్రవేత్త లు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా, చైతన్యం రాకపోవడం శోచనీయం.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles