సరిపడా యూరియా

Thu,September 19, 2019 12:51 AM

కాగజ్‌నగర్ రూరల్ : రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందనీ, ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మం డలంలో ఇప్పటి వరకు 4 లారీల యూరియాను పంపిణీ చేశామన్నారు. మరో రెండురోజుల్లో మరో 400 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. రైతులు మొదటి దఫా, రెండో దఫాకు సరిపడా యూరియాను ముందస్తుగా తీసుకెళ్లడంతోనే కొరత వచ్చిందన్నారు. ఎకరానికి 35 కిలోల వరకు అవసరం ఉంటుందనీ, కానీ రై తులు నాలుగు రేట్లు అధికంగా యూరియా వాడుతున్నారన్నారు. వీరి వెంట ఏఈవో హెప్సీబా, సిబ్బంది ముక్తార్, వెంకన్న, సతీశ్, రైతులు ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles