ముగిసిన కుష్ఠు సర్వే

Thu,September 19, 2019 12:51 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగా ణ: కుష్ఠు వ్యాధిపై ఇంటింటా నిర్వహించిన సర్వే ముగిసింది. కుష్ఠు, క్షయ వ్యాధులను గుర్తించేందుకు గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జి ల్లాలో వైద్య బృందాలు ప్రత్యేకంగా ఇంటింటి సర్వే నిర్వహించాయి. సుమారు 765 మంది సిబ్బంది జిల్లాలోని 15 మండలాల్లో 1,30, 844 ఇండ్లలో 5 లక్షల 37 వేల 725 మందిని సర్వే చేశారు. వీరి లో 1863 మందికి కుష్టు, క్షయ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిలో ఇప్పటికే 25 మందికి నిర్ధారించారు. ఆడ పీహెచ్‌సీ పరిధిలో ఇద్దరికి, రెబ్బెన పీహెచ్‌సీలో ఒకరు, కాగజ్‌నగర్ ఒకరు, బ ట్టుపల్లి పీహెచ్‌సీ పరిధిలో 9 మంది, ఈజ్‌గాం పీ హెచ్‌సీ పరిధిలో ఒకరు, దహెగాం పీహెచ్‌సీ పరిధి లో ముగ్గురు, లోన్‌వెల్లి పీహెచ్‌సీ పరిధిలో ఇద్దరు, కౌటాల పీహెచ్‌సీ పరిధిలో ఇద్దరు, బాబాపూర్ పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి వ్యాధి సోకినట్లు నిర్థారించారు. గతంలో జిల్లాలో 101 మందికి మాత్ర మే ఈ వ్యాధి ఉండగా ఇటీవలి కాలంలో ఈ వ్యా ధి మరింత పెరిందనే అనుమానాలు కలుగుతున్నా యి. జిల్లాలో ఈ వ్యాధిని సరిగ్గా అంచనా వేసేందు కు వైద్య బృందాలు ప్రత్యేకంగా నిర్వహించిన సర్వే లో 1863 మంది అ నుమానితులను గుర్తించడం తో జిల్లాలో వ్యాధి పెరింగిందని భావిస్తున్నారు.

వ్యాధి ఉందని భావిస్తున్న వారి కుటంబ వివరాల ను పూర్తిస్థాయిలో సేకరించి అనుమానితుడి రక్తనమూనాలను సేకరించి ప్రత్యేక వైద్యుల పరీక్షలు ని ర్వహిస్తారు. కుష్టు వ్యాధి ప్రాథమిక లక్షణాలైన తెల్ల మచ్చలు గుర్తించి వారిని రోగులుగా అంచనా వేస్తా రు. అనంతరం వారికి పరీక్షలు చేపడుతారు. పీహెచ్‌సీలలో వైద్యులు రోగులను పూర్తిస్తాయిలో పరీక్షించి వ్యాధి నిర్థారణ చేస్తారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారి తెమడ సేకరించి ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే వారికి ప్రభు త్వం ద్వారా పూర్తిస్తాయిలో ఉచితంగా మందులను అందిస్తారు. జిల్లాలో గతంతో పోలిస్తే వ్యాధి పెరిగినట్లుగా తెలుస్తోంది. గాలి ద్వారా వ్యాధి వ్యాప్తి చెం దుతుంది. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మండగించడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ రావటం, వంటివి కుష్ఠు లక్షణాలు. ఈ రోగులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ప్రభుత్వ దవాఖానల నుంచి మందులను ఉ చితంగా అందిస్తారు. వైద్యుల సలహా మేరకు మం దులు సక్రమంగా వాడడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles