పేకాటరాయుళ్ల అరెస్ట్

Thu,September 19, 2019 12:51 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల పట్టణంలోని మేదరివాడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి దాడిచేశారు. పేకాట ఆడుతు న్న ఏడుగురిని అరెస్ట్ చేయడంతో పాటు రూ. 47,920 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో చాంద్‌ఖాన్, గుం డు తిరుపతిగౌడ్, గోపతి మల్లేశ్, గైని సత్యనారాయణ, తోకల సాగర్, డాగె లక్ష్మణ్, కాండగుల అరుణ్ ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles