ముందస్తు నివారణకే హోమియోపతి

Thu,September 19, 2019 11:44 PM

సిర్పూర్(యు): డెంగీ, మలేరియా, టై ఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకకుండా ముందస్తుగా హోమియోపతి మాత్రలు వేస్తున్నట్లు పంగిడి సర్పంచ్ ఆత్రం జాలీంషా అన్నారు. బాలుర ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం హోమియోపతి మాత్రలు వేశారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దోమలు, ఈగల ప్రభావం అధికంగా ఉండడం వల్ల ప్రజలు రోగాల భారిన పడతారన్నారు. ఇందులో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యా ధులు కొన్ని సార్లు ప్రాణంతకమవుతాయన్నారు. సోకకుండా ఉండేందు కు హోమియోపతి మందులు వాడడం మే లన్నారు. దీంతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పా రు. ఆయూష్ ద్వారా వైద్యులు అందిస్తున్న మందులను వైద్యుల సూచన ప్రకారం త ప్పని సరిగా వాడాలన్నారు. వైద్య సిబ్బంది మల్లీశ్వరి , మోతిరాం, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తొడసం ధర్మారావు, హెచ్‌ఎం మల్కు, నాయకులున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles