నవేగాంలో స్వచ్ఛత యే సేవా

Fri,September 20, 2019 10:50 PM

సిర్పూర్(టి)రూరల్ : మండలంలోని నవేగాం పంచాయతీలో శుక్రవారం స్వచ్ఛతయే సేవా కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌డీవో వెంకట్‌శైలేష్ పాల్గొని ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా నవేగాం గ్రామ పంచాయతీని మోడల్‌విలేజ్‌గా తీసుకున్నామన్నారు. ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని వాడుకోవాలనీ , ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త లేకుండా, డ్రైనేజీల్లో మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలో ఖాళీ స్థలాలోల చెత్తవేయవద్దన్నారు. ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల చాలా అనార్థాలకు జరుగు తాయనీ, వాడవద్దని సూచించారు. సర్పంచ్ చిన్నుబాయి, ఎంపీడీవో జగదీష్ అనిల్‌కుమార్, ఎస్‌బీఎంజీ ప్రశాంత్, ఏపీఎం రామోహన్‌రావు, ఏపీవో దుర్గయ్య, ఏఈవో కవిత, పం చాయతీ కార్యదర్శి ఫహీంబాను, గ్రామస్తులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles