విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

Fri,September 20, 2019 10:51 PM

-ఏసీఎంవో పుర్క ఉద్దవ్
ఆసిఫాబాద్ టౌన్: విద్యార్థులో విద్యా ప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని ఏసీఎంవో పుర్క ఉద్దవ్ అన్నారు. శుక్రవారం వట్టివాగు కాలనీలోని దిశ పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల వాతావరణం,విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏటీడీవో శ్రీనివాస్, జీసీడీవో శంకుతల, కాంప్లెక్స్ హెచ్‌ఎం ప్రీతి తదితరులున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles