అమ్మాయిలను వేధిస్తే చర్యలు

Fri,September 20, 2019 10:51 PM

ఆసిఫాబాద్ టౌన్: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఇన్‌చార్జి ఫసీయోద్ధీన్ అన్నారు. శుక్రవారం షీటీం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలిక ల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే వయస్సులో సమయాన్ని వృథాచేయడం వలన భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. మహిళలను, యువతులను ఆకతాయిలు వేధిస్తే 7901674838 కాల్ చేయడంతో పాటు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉం చుతామని చెప్పారు. ఆడ పిల్లల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయనీ, సద్వినియోగం చేసుకోవాలన్నారు. షీటీం బృందం స్వప్న, శ్రీలత, ప్రధానోపాద్యాయురాలు వకుల దేవి తదితరులున్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles