బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం

Sun,September 22, 2019 01:15 AM

వాంకిడి: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండాలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని జడ్పీటీసీ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని బీసీ కమిటీ హాల్‌లో బాపూజీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొండాలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బాపూజీ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, సర్పంచ్ బండే తుకారాం, ఉపసర్పంచ్ పవన్‌సాయి, కొండాలక్ష్మణ్ బాపూజీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాదే ఆవినేష్, కార్యదర్శి అశోక్, పద్మశాలీ మండల నాయకులు రోహిదాస్, శేఖర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం కొండాలక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, నాగరాజు, పోషం, సాగర్, మహేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని గోలేటిటౌన్‌షిప్‌లో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పద్మశాలీ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు మారిన వెంకటేశ్వర్లు ,నాయకులు పోన్న శంకర్, బోగే ఉపేందర్, బైరి సాంబయ్య, అనిల్, జంపయ్య పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles