మహిళల రక్షణ కోసమే షీటీం

Sun,September 22, 2019 01:15 AM

వాంకిడి: మహిళలకు ఆత్మరక్షణ కల్పించేందుకే తెలంగాణ సర్కారు షీటీంలను ఏర్పాటు చేసిందని ఆసిఫాబాద్ ఏఎస్‌ఐ ఫసీవొద్దిన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీటీం బృందం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆకతాయిల నుంచి మహిళలను రక్షించేందుకు షీటీం పని చేస్తుందన్నారు. విద్యార్థులందరూ సోదరుల్లాగా ఉండి వారి బంగారు జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. విద్యార్థినులను ఎవరైన వేధింపులకు గురిచేస్తే వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు లేదా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు, కార్యక్రమంలో షీటీం బృందం సభ్యులు స్వప్న, శ్రీలత, వాంకిడి హెడ్‌కానిస్టేబుల్ ముండే ఉద్దవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వామన్‌రావు ,తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles