పర్యావరణాన్ని పరిరక్షించాలి

Sun,September 22, 2019 01:15 AM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: మట్టి పాత్రలను వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తన కార్యాలయంలో కుమ్మరి సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి జిల్లాల్లోని అన్ని హోటళ్లలో మట్టి గ్లాస్‌లు, కప్పులు వాడలన్నారు. ఇందుకోసం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో లక్ష గ్లాస్‌లు తయారు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వాడడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందన్నారు. మట్టిపాత్రల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి మొండి, కోశోధికారి శ్రీనివాస్, నాయకులు మహేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles