వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Sun,September 22, 2019 01:16 AM

తిర్యాణి: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రోంపల్లి వైద్యాధికారి మురళీధర్ సూచించారు. శనివారం మండలంలోని ముల్కలమంద, తోయరేటి గ్రామాల్లో హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు సీజనల్ వ్యాధులపై అవగాహన, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. 79 మందికి వైద్యపరీక్షలు చేసిఅందులో 16 మంది జ్వర పీడితులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుడ్మెత మెంగుబాయి, ఉపసర్పంచ్ సిడాం సుశీల, తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles