చరిత్రాత్మక నిర్ణయాలు

Sun,September 22, 2019 01:20 AM

- 356 మంది డిస్మిస్ కార్మికులను తీసుకోవడం సీఎం సాహసోపేత నిర్ణయం
- 28 శాతం ప్రకటనతో కార్మికులకు రూ.లక్షకు పైగా లాభాల వాటా
- వాటా విషయంలో ఏఐటీయూసీ విమర్శలు మానుకోవాలి
- దమ్ముంటే దీపావళి బోనస్ రూ.లక్ష ఇప్పించాలి..
- టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్

సీసీసీ నస్పూర్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కార్మిక పక్షపాతి అని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు. ఏరియా ఉపాధ్యక్షుడు సు రేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే న్యూటెక్ గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మికులంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని అభిమానమన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి రూ.1,7 66 కోట్ల లాభాల నుంచి 28 శాతం వాటా ఇవ్వడానికి నిర్ణయించడం సాహసోపేట నిర్ణయమన్నారు. దీంతో ఒక్కొ కార్మికుడికి రూ.లక్షకుపైగా లాభాల వాటా రానుందని తెలిపారు. వచ్చే నెలలో కార్మికుడి ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. అండర్‌గ్రౌండ్ గని కార్మికులకు మస్టర్‌కు రూ.450, ఉపరితల గని కార్మికులకు రూ.371, ఇతర డిపార్ట్‌మెంట్ల కార్మికులకు రూ.347 చొప్పున లేక్కకడుతుందని ఆయన వివరించారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తమ యూనియన్‌కు అలవాటు లేదని అన్నారు. లాభాల వాటా పెంపును కొన్ని కార్మిక సంఘాలు జీర్ణించుకోకపోతున్నారని మండిపడ్డారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉండి ఒక్క శాతం లాభాల వాటా పెంచలేదని, వాటా పెంచుకుంటూ పోతున్న తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏఐటీయూసీకి దమ్ముంటే దీపావళి బోనస్ రూ.లక్ష ఇప్పించి కార్మిక ముందుకురావాలని సవాల్ విసారారు.

రెండు నెలల్లో విధుల్లోకి డిస్మిస్ కార్మికులు..
సింగరేణి యాజమాన్యంతో తాము మరో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని, 2000 సంవత్స రం నుంచి 2018 వరకు వివిధ కారణాలతో డి స్మిస్ అయిన కార్మికులకు మరోసారి ఉద్యోగం క ల్పించడానికి యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఒప్పందంతో సింగరేణి వ్యాప్తంగా 356 మంది డిస్మిస్ కార్మికులు మ రోసారి ఉద్యోగంలో చేరబోతున్నట్లు చెప్పారు. సింగరేణి చరిత్రలో ఏ యూనియన్ ఇలాంటి ఒ ప్పందం చేసుకోలేదన్నారు. కార్మిక కుటుంబాలకు కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు కల్పిస్తూ కార్మిక కుటుంబాల్లో సీఎం కేసీఆర్ సంతోషాన్ని నింపారని, 46 మెడికల్ బోర్డుల ద్వారా 5వేల మంది కార్మికులు ఇన్‌వాలిడేషన్ అయ్యారని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు.

టీబీజీకేఎస్‌లో భారీ చేరికలు..
గనికి చెందిన కార్మికులు భారీ సంఖ్యలో వెంకట్రావ్ సమక్షంలో టీబీజీకేఎస్ యూనియన్‌లో చేరారు. ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంపత్, అనిల్‌కుమార్, జక్కుల సాగర్, యశ్వంత్‌రెడ్డిలతోపాటు 200 మంది యువ కార్మికులు చేరగా వీరందరికి వెంకట్రావ్ యూనియన్ కండువాలు కప్పి, టీబీజీకేఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, రీజియన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, రాజనాల రమేష్, బుస్స రమేష్, ఫిట్ కార్యదర్శులు పొట్లచర్ల శ్రీరాములు, మెండె వెంకటి, పెండ్లి రవీందర్, ఈసంపల్లి ప్రభాకర్, నాయకులు ఐరెడ్డి తిరుపతిరెడ్డి, నెల్కి మల్లేష్, శ్రీరాములు, కిషన్, హన్మంతు, ప్రసాద్, వెంకట్రాములు, మల్లేష్, సిద్ధం శంకర్ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles