ఉత్సవాలను విజయవంతం చేయాలి

Mon,September 23, 2019 07:03 AM

దండేపల్లి : గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‌పురి కాకో ఆలయంలో దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించనున్న దండా రి ఉత్సవాలను విజయవంతం చేయాలని గోండ్వానా రాయి సెంట ర్ జిల్లా అధ్యక్షుడు పెంద్రం రామ్‌పటేల్ కోరారు. ఆదివారం సాయం త్రం దండేపల్లి మండల కేంద్రంలో దండారి ఉత్సవాల నిర్వహణపై ఆదివాసీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అక్టోబర్3న జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉత్సవాలకు ఆదివాసీలు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుడిమెత సోము, సభ్యులు పెంద్రం శ్రీను, సిడాం దాము, మహారాష్ట్రకు చెందిన పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles