ఎస్‌జీఎఫ్ క్రికెట్ జట్ల ఎంపిక

Mon,September 23, 2019 07:03 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14,17 బాల బాలికల, అండర్ 17 బాలికల క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఆదివారం మంచిర్యాలలోని ట్రినిటి ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఎస్‌జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాబురావు, జిల్లా కార్యదర్శి రోజీవరకుమారి, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల నిర్వహణ కన్వీనర్‌గా ట్రినిటి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ బిజుకురువిల్లా, నిర్వహణ కార్యదర్శిగా వ్యాయామ ఉపాధ్యాయుడు రవి వ్యవహరించారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారు లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆదిలాబాద్, నిర్మల్‌లో జరుగనున్న జోనల్ పోటీలకు ఎంపిక చేశామని రోజివరకుమారి తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల జాబితాను రోజి వరకుమారి ప్రకటించారు. ట్రిని టి పాఠశాల డైరెక్టర్ సుమనజాన్, వ్యాయామ ఉపాధ్యాయులు యాకూబ్, రాజమల్లు, సుప్రజ, రాజేందర్, రవీంద్ర పాల్గొన్నారు.

అండర్ 14 బాలుర జట్టు : కే వరుణ్‌తేజ్, హర్షవర్థన్, బీ సందీప్, బీ సృజన్, సీహెచ్ రాకేశ్, కే అభిరామ్, ఏ వర్షిత్, జీ అశ్విక్‌సాయి, సీహెచ్ విన య్, ఐ సంతోశ్, టీ అఖిల్‌రావు, డీ వందన్, జీ రంజిత్‌గౌడ్, పీ రఘురామ్
అండర్ 17 బాలుర జట్టు : ఏ సాయిచరణ్,డీ వశిష్ట, సీహెచ్ రఘువీర్, డీ అభినయ్,పీ రఘు,బీ సునిల్, ఎండీ అమీర్, ఎండీ అశ్విక్,బీ హరిష్‌కుమార్, బీ రాజశేఖర్, ఆర్ మన్విత్, ఏ సాయికుమార్, జే అరుణ్‌కుమార్,ఎస్ ప్రవీన్, యుదిస్టర్
అండర్ 17 బాలికల జట్టు : కే వెంకటలక్ష్మి, ఎం శ్యామల,బీ రాజేశ్వరీ,యం సలోని,పీ సాయివైష్ణవి, ఎస్ తిరందని,జే హరిణి, వై యక్షిత, ఆర్ కీర్తి, ఎన్ శ్రీజ, ఎల్ సుప్రజ, ఎం వర్షితరెడ్డి

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles