పౌష్ఠికాహారంతోనే ఆరోగ్యం

Tue,September 24, 2019 01:18 AM

రెబ్బెన: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటేనే తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సీడీపీవో కిరణ్మయి అన్నారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా మండలంలోని కొండపల్లి గ్రామ పంచాయతీలో మండల ప్రాజెక్టు ఐసీడీఎస్ ఆసిఫాబాద్ వారి ఆధ్వర్యంలో సోమవారం పోషణ మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు ప్రదర్శన నిర్వహించారు. బతుకమ్మ పెట్టి ఆటలు ఆడుతూ, పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు మంచి పోషకాలు కలిగిన పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. పౌష్టికాహారం తీసుకోకపోతే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలు సమయం ప్రకారం తెరిచి సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కొండపల్లి సర్పంచ్ వడై శాంత, కోఆప్షన్ మెంబర్ జౌరోద్దిన్, ఎంపీటీసీ రఘుపతి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరోజినిదేవి, బ్లాక్ కోఆర్డినేటర్ శారద, ప్రాజెక్టు అసిస్టెంట్ కుమారస్వామి పాల్గొన్నారు.

జైనూర్: గిరిజన మండలాల్లో రక్తహీనతతోనే వ్యాధులు వస్తున్నాయని ఐసీడీఎస్ సీడీపీవో ప్రభావతి అన్నారు. సోమవారం మండలంలోని మార్లవాయి గ్రామంలో పోషణ్ అభియాన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కనక ప్రతిభవెంకటేశ్వర్‌రావ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles