మహిళల భద్రత కోసమే షీ టీంలు

Tue,September 24, 2019 01:19 AM

సీసీసీ నస్పూర్ : మహిళల భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తీగల్‌పహాడ్ లక్ష్మి గార్డెన్స్‌లో షీ టీమ్స్‌పై సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడా నికి షీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మారుతున్న టెక్నాలజీకనుగుణంగా అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే సమస్యలు రావని చెప్పారు. విద్యార్థినులకు ఏదైనా సమస్య వస్తే ముందుగా ఉపాధ్యాయులకు, తర్వాత తల్లిదండ్రులకు తెలియజేయాలని .. పరిష్కారం కాకుంటే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. చదువుకునే వయసులో ఆకర్షణలకు లోనై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ కుమార్, ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం నస్పూర్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి మైదం రామకృష్ణ, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కోడం ప్రభాకర్, సత్యనారాయణ, విద్యార్థినులు, టీచర్లు , తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles