ప్రగతి బాటలో మేము సైతం

Tue,September 24, 2019 01:21 AM

-30 రోజుల ప్రణాళికలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
-ఊరూరా ఉత్సాహంగా కార్యక్రమం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్ర మాలు ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అ ధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు స్వచ్ఛం దంగా పాల్గొంటున్నారు. పారిశుధ్యపనులతో పాటు రో డ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించ డం, కరెం టు లైన్‌లను సరిచేయడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగజ్‌నగర్ మండ లంలోని ఈజ్‌గాంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పర్యటించి 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించ డంతో పాటు హరిత హారం మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరిం చాలని కోరారు. పెంచి కల్‌పేట్ మండలం చేడ్వాయిలో ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప హరిత హారం మొక్కలు నాటారు. వాంకిడిలో శ్రీ ఆంజనేయ స్వామి యువజన సంఘం ఆధ్వర్యంలో పి చ్చిమొక్కలు తొలగించారు. డీఎల్‌పీఓ రమేశ్ ఆధ్వర్యం లో పిచ్చిమొక్కలు తొలగించారు. కౌటాలలో తాసి ల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక కోసం స్థలాన్ని ఎంపిక చేశారు.

పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్‌లో సర్పంచ్ దుర్గం రాజన్న, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సాజిద్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన ప్ర భుత్వ భవనాలను కూల్చివేశారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడలో సర్పంచ్ మాధవి ఆధ్వర్యం లో పిచ్చి మొక్కలు తొలగించారు గుండలో సర్పంచ్ జాబిరి అరుణ ఆధ్వర్యంలో హరతహారం నిర్వహించా రు. రెబ్బన మండలం పులికుంటలో సర్పంచ్ పోశమ ల్లు, గంగాపూర్‌లో సర్పంచ్ వినోద్ ఆధ్వర్యంలో మొక్క లు నాటారు. రోడ్లుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తొలగించారు. జైనూర్‌లో ఎంపీడీవో దత్తారం ఆధ్వర్యం లో దబోలిలో ఈఓపీర్డీ ప్రభుదేవా ఆద్వర్యంలో పిచ్చి మొక్కలను తొలగించారు. దహెగాం మండలంలోని హత్తిని, పీపీరావు కాలనీల్లో జడ్పీటీసీ శ్రీరామరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పలు పనులను ఆ యన పరిశీలించారు. సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, జక్కాపూర్‌లో జిల్లా విద్యాధికారి, మండల ప్రత్యేకా ధికారి భిక్షపతి పాల్గొన్నారు. వివిధ పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులను చేయించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు ఆయన సూచించారు.

పల్లెల్లో పండుగ వాతావరణం
జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ ఒక వైపు... మ రో వైపు 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజా ప్రతినిధులు ఉ దయం నుంచే గ్రామాల బాటపడుతున్నారు. గ్రామస్తు ల సహకారంతో పల్లెల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles