కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం

Tue,September 24, 2019 02:05 AM

దేవరకద్ర రూరల్ : జూరాల బ్యాక్ వాటర్‌తో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఈనెల 8వ తేదీ నుంచి జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ చేస్తున్న విషయం అందరికీ విధితమే. అయితే, సోమవారం సాయంత్రం వరకు 25.5 అడుగులకు నీటి నిల్వ చేరిందని ప్రాజెక్టు డీఈ నాగిరెడ్డి తెలిపారు. జూరాల నుంచి కాల్వల ద్వారా 03 టీఎంసీల నీరు కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో చేరుతుండగా, కుడి కాలువ ద్వారా 180 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 120 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు పొలాలు, గొలుసుకట్టు చెరువులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నారాయణపేట, కొడంగల్, మద్దూర్ మండలాలకు తాగునీటి అవసరాలకు 11 క్యూసెక్కుల నీటి తరలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా, కుడి కాలువ ఆయకట్టు రైతులు ప్రస్తుతం నీటి విడుదల ఆపాలని కోరడంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేసే మోటర్లలో ఒక మోటరు 24 గంటలపాటు, రెండవ మోటరు 13 గంటలు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 32 అడుగులు (2.277 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 25.5 అడుగులు (1.45 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. పాత అలుగు లెవల్ 26 అడుగులు, ఇంకా అర్ధ అడుగు నీళ్లు వస్తే షటర్ లెవుల్ నీరు చేరుకుంటుందని ప్రాజెక్టు డీఈ తెలిపారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles