ప్రతి పల్లె ఆదర్శంగా మారాలి

Tue,September 24, 2019 02:05 AM

చిన్నచింతకుంట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక మేరకు ప్రతి పల్లెను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పెద్ద వడ్డెమాను గ్రామంలో నిర్వహిస్తున్న ప్రణాళిక పనులను ఆమె పరిశీలించారు. ముందుగా గ్రామం లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక పనులను ఊరూరా ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధానంగా సీజనల్ వ్యాధుల నివారణ కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పెంచాలని కోరారు. కార్యక్రమం లో ఎంపీడీవో ఫయోజొద్దీన్, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, సర్పంచ్ ఫర్జానా షిరాజొద్దీన్, వార్డు సభ్యులు నస్రీమా బేగం, ఫాతిమా బేగం, అలివేలమ్మ, మహమూద్ ఖలీల్, అమీద్, తిరుమలేశ్, స్పెషల్ అధికారి దుర్గాదేవి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, సురేందర్, ప్రవీణ్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles