ఎస్జీఎఫ్ క్రీడా తేదీల ఖరారు

Mon,October 14, 2019 03:05 AM

-నేటి నుంచి 16వ తేదీ వరకు నిర్వహణ
మంచిర్యాల స్పోర్ట్స్ : ఈ నెల 14న ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్-14 బాలబాలికల బాస్కెట్‌బా ల్ ఎంపిక పోటీలతో పాటు జోనల్ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ రోజీవరకు మారి తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు మం చిర్యాలలోని డీవైఎస్‌వో మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 15న శ్రీరాంపూర్ లోని కేరళ మోడల్ స్కూల్‌లో అండర్-14 బాలబాలికల చెస్ పోటీలు జిల్లా స్థాయి, జోనల్ స్థాయి పోటీలు ఉంటాయనీ, క్రీడాకారులు ఆర్గనైజర్ మల్లేశ్(సెల్ నంబర్ 9494940708)ను సంప్రదించాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 16న మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌లో అం డర్-14 బాలుర ఫుట్‌బాల్ జిల్లాస్థాయి, జోనల్ స్థాయి పోటీలు ఉంటాయని క్రీడాకారులు వయ స్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9గంటలకు పీఈటీ ఇర్ఫాన్‌కు రిపోర్ట్ చేయాలని తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles