కుమ్రం భీమ్‌కు ఘన నివాళి

Mon,October 14, 2019 03:08 AM

-నివాళులర్పించిన మంత్రి, ఎంపీ, జడ్పీ అధిపతులు, ఎమ్మెల్యేలు, అధికారులు
-కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులతో కలిసి పూజలు చేసిన భీం మనుమడు సోనేరావు
-వేలాదిగా తరలివచ్చిన అడవిబిడ్డలు.. జన సంద్రమైన పోరుగడ్డ
-అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆకట్టుకున్న స్టాళ్లు
-ఆదివాసులకు ఎడ్లు, ఎడ్లబండ్లు, వాహనాల పంపిణీ
-పోలీసుల భారీ బందోబస్తు

కెరమెరి: అడవితల్లి ముద్దుబిడ్డ కుమ్రం భీం 79వ వర్ధంతి ఆదివారం జోడెఘాట్‌లో సం స్కృతీ సంప్రదాయాలతో వాయిద్యాల నడుమ నిర్వహించారు. భీం మనుమడు సోనేరావ్ ఆధ్వర్యంలో జెండాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమ్రం భీం విగ్రహం వద్ద సోనేరావ్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎంపీ సోయం బాపురావ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, జోగు రామన్న, వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య, ఎస్పీ మల్లారెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవరావ్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మర్సుకొల సరస్వతి, ఎంపీపీ పేందోర్ మోతిరాం, జడ్పీటీసీలు సెడ్మకి దుర్పతబాయి, కోవ అరుణ, జోడెఘాట్ సర్పంచ్ సోనిబాయి, ఆదివాసీ నాయకుడు సిడం అర్జు నివాళులర్పించారు. అనంతరం కుమ్రం సూరు 22వ వర్ధంతి అతని మనమడు కుమ్రం పాండు ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి, జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సూరుకు నివాళులర్పించారు. వర్ధంతి సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి ఆదివాసీలు, అభిమానులు వేలాది సంఖ్యలో తరలిరావడంతో పోరుగడ్డ జనసంద్రంగా మారింది. రూ.25 కోట్ల తో నిర్మించిన భీంస్మృతి చిహ్నం, భీం కాంస్య విగ్రహంతో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసి న చిత్రాలు, కళఖండాలు జనం ఆసక్తిగా చూశారు.

ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపునివ్వాలి
ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి అభివృద్ధికి పాటుపడాలని ఆదివాసీలు సభ దృష్టికి తీసుకవచ్చారు. జోడెఘాట్‌లో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతి సభలో ఆదివాసీ నేత సిడాం అర్జు, జిల్లా రాయిసెంటర్ మేడి కోట్నాక కిషన్‌రావ్‌తో పాటు తెగల ఆదివాసీలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వల్లే జోడెఘాట్‌కు కొత్త శోభ వచ్చిందనీ, అదే తరహలో ఆదివాసుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుధీంద్ర, అసిస్టెంట్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, గోపి, డీఎంహెచ్‌వో కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌కుమార్, ఆర్డీవో సిడాం దత్తు, తాసిల్దార్ ప్రమో ద్, ఉత్సవ కమిటీ చైర్మన్ పేందోర్ రాజేశ్వర్, విద్యుత్ శాఖ ఏడీఏ రవికుమార్, ఏఈ మందపెల్లి శ్రీనివాస్, ఏటీడబ్ల్యూవోలు, ఆదివాసీ నాయకులు సరస్వతి, సుధాకర్, కొట్నాక విజయ్, జంగు, విజయ్, భీంరావ్, ధర్ము పాల్గొన్నారు.
సిర్పూర్(యు): మండల కేంద్రంలో ఆదివాసులు కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కెరమెరి మం డలం జోడెఘాట్‌లో నిర్వహించే భీం వర్ధంతి సభకు మండలంలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఆదివాసీ నాయకులు, ప్రజలు తరలివెళ్లారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావ్, భీంరావ్ స్వామి, అర్క నాగోరావ్, భీంరావ్, బుజంగ్‌రావ్, రాజరాం, తదితరులు పాల్గొన్నారు.

జోడెఘాట్‌కు తరలిన, ఆదివాసులు, నాయకులు
రెబ్బెన: కెరమెరి మండలం జోడెఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి మం డలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. అక్కడ కుమ్రం భీం సమాధి వద్ద, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరలిన వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడేల్, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్‌ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, నంబాల సర్పంచ్ చెన్న సోమశేఖర్, రెబ్బె న ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టీఆర్‌ఎస్ నాయకుడు మోడెం సుదర్శన్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ ఉన్నారు. జైనూర్: మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఆదివాసులు ఆదివారం మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో జోడెఘాట్‌లో నిర్వహించిన కుమ్రంభీం వర్ధంతి కార్యక్రమానికి తరలివెళ్లారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles