మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

Tue,October 15, 2019 01:35 AM

దహెగాం: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మత్స్యశాఖ జిల్లా అధికారి సాంబశివరావు అన్నారు. సోమవారం మండలంలోని కోత్మిర్ గ్రామంలోని ఎర్రకుంట చెరువులో 70 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువుల్లో వదిలిన చేపపిల్లలను సాదుకునే బాధ్యత మత్స్యకారుల సొసైటీలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తరున్నం సుల్తానా, ఉపసర్పంచ్ చదువుల లలిత, పీఏసీఎస్ డైరెక్టర్ సోను, మత్స్యకారులు గిరుగుల చిన్నన్న, గిరుగుల సురేశ్, తిరుపతి, నారాయణ, నాయకులు చదువుల సత్తన్న, మిట్ట సాగర్ పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles