జాతీయస్థాయిలో రాణించాలి

Tue,October 15, 2019 01:37 AM

సిర్పూర్(టి) : గురుకులాల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల 6వ జోనల్‌స్థాయి క్రీడలు నిర్వహించారు. అధ్యక్షురాలు కోవ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై, జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గురుకులాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. జోనల్‌స్థాయిలో సత్తాచాటి జాతీయస్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తిచూపాలన్నారు. అంతకుముందు ప్రారంభోత్సవానికి వచ్చిన అధ్యక్షురాలికి గురుకుల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మైదానంలో గల క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల గురుకుల పాఠశాలల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి రేఖ, సర్పంచ్ తఫిమా పర్విన్, గురుకులాల జాయింట్ సెక్రెటరీ మామిడాల ప్రవీణ్, గురుకులాల రాష్ట్ర సహాయ క్రీడా అధికారి పోగుల స్వాములు, ఆర్సీవో గంగన్న, ఏఆర్సీవో మహేశ్వర రావు, సిర్పూర్(టి) గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ గురుకుల బాలుర పాఠశాలల ప్రిన్సిపాళ్లు దామోదర్‌రెడ్డి, ఐనాల సైదులు, సమ్మయ్య, శ్రీనివాస్, ఉపేందర్, ఎల్లయ్య, ఆదిలాబాద్, కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ అధికారులు శంకర్, హరిరాం, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్, మండల కోఆప్షన్ సభ్యుడు కీజర్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles