దరఖాస్తుల వెల్లువ

Thu,October 17, 2019 01:21 AM

-జిల్లావ్యాప్తంగా మద్యం షాపులకోసం పోటాపోటీ
-ముగిసిన టెండర్ ఫారాల స్వీకరణ
-బుధవారం ఒక్కరోజే 307 దాఖలు
-అత్యధికంగా సిర్పూర్(టి), అత్యల్పంగా గోలేటికి ..
-సరిహద్దు మండలాల్లోని వైన్స్‌లకు భారీ డిమాండ్
-ఎన్నడూ లేనంతగా రూ. 15.26కోట్ల ఆదాయం
-రేపు కలెక్టర్ ఆధ్వర్యంలోలాటరీ పద్ధతిలో ఎంపిక
-వ్యాపారుల్లో ఉత్కంఠ

కుమ్రం భీం ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో మద్యం దుకాణాలకోసం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. జిల్లా వ్యా ప్తంగా 26 దుకాణాలకు 763 దరఖాస్తులు వ చ్చాయి. జిల్లాలో అత్యధికంగా సిర్పూర్-టి మండలంలోని 20వ నంబర్ వైన్స్ షాపుకు 81 టెండర్లు దాఖలు కాగా, అత్యల్పంగా రెబ్బన మండలంలోని గోలేటి దుకాణానికి 13 దరఖాస్తులు వచ్చాయి. వ్యాపారులు మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడడంతో టెండర్ ఫారాల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 15 కోట్ల 26 లక్షల ఆదాయం సమకూరింది...

పోటాపోటీగా టెండర్లు...
జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా టెండర్లు వేశారు. ఈనెల 9న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియలో మొదట నామమాత్రంగా టెండర్ ఫారాలు దాఖలైనప్పటికీ చివరి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 26 మద్యం దుకాణాలకు 456 టెండర్లు దాఖలు కాగా, బుధవారం ఒక్కరోజే 307 టెండర్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ డివిజన్‌లోని 13 మ ద్యం దుకాణాలకు 299, కాగజ్‌నగర్‌లోని 13 దు కాణాలకు 464 దరఖాస్తులు అందాయి. టెండర్ ఫారాల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 15 కోట్ల 26 లక్షలు ఆదాయం సమకూరింది. ఆసిఫాబాద్ డివిజన్‌లోని 13 మద్యం దుకాణాల ద్వారా రూ. 5 కోట్ల 98 లక్షలు, కాగజ్‌నగర్ డివిజన్‌లోని 13 దుకాణాలకు రూ. 9 కోట్ల 28 లక్షలు ఆదాయం సమకూరింది.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles