ప్రతి మొక్కకూ లెక్కుండాలి

Fri,October 18, 2019 11:22 PM

జైనూర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని, దానికి లెక్కుండాలని ఎంపీడీవో బానవత్ దత్తారాం పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైనూర్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలో రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యు ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు సంరక్షించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం పెంచి మొక్కలనూ రక్షించుకోవాలన్నారు. ట్రీగార్డు లేని మొక్కలకు ఏర్పాటు చేయాలనీ, ప్రతి గ్రామ పంచాయతీకి నీటి సరాఫరా కోసం ట్యాంకర్, ట్రాక్టర్ అందించడం జరుగుతుందన్నారు. ప్రణాళికలో ప్రజలందరూ పారిశుధ్యంపై ఎంతో దృష్టి సారించారని, అదే స్ఫూర్తిని కొనసాగించేలా చూడలన్నారు. 30రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులన్ని ఇకముందు కూడ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో సర్పంచులు లక్ష్మణ్, భీంరావ్, గోవింద్‌రావ్, శ్యాంరావ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles