మత్స్య కారులు ఆర్థికంగా ఎదగాలి

Mon,October 21, 2019 12:40 AM

బెజ్జూర్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. మండల కేంద్రంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గంగ మ్మ తల్లి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగమ్మ తల్లి విగ్రహం వద్ద పూజలు చేసి ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదనీ, ఇందుకోసమే ఉచితంగా చేపపిల్లలు అందజేస్తున్నాదన్నారు. మత్స్య కారుల భవనానికి నిధులు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షు డు సూర్ల ఇస్తారి ఎమ్మెల్యేను కోరగా ప్రభు త్వం నుంచి రూ. 10 లక్షలు మంజూరుకు కృ షి చేస్తానని హామీనిచ్చారు. ఉత్సవాలు 5 రో జుల పాటు కొనసాగనున్నట్లు సంఘం అధ్యక్షుడు తెలిపారు. అంతకుముందు మండల కేం ద్రానికి చెందిన మత్స్య కారుల సేవా సఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మం డలాధ్యక్షుడు అన్సార్ హుస్సేన్, జిల్లా సభ్యు డు కోండ్ర జగ్గాగౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం స్థానిక సర్పంచ్ అన్సార్ హుస్సేన్, ఉపసర్పంచ్ నికాడి బాబురావ్, నాయకులు జావీద్‌అలీ ఖాన్, గుమ్ముల శ్రీనివాస్, మత్స్య కారుల సంఘ సభ్యులు పాకాల బిచ్చయ్య, గుమ్మల బాలయ్య, తదిత రులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles