జోనల్ స్థాయి క్రీడాపోటీలు షూరూ..

Sat,November 9, 2019 05:41 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఉట్నూర్‌లోని కుమ్రం భీం ప్రాంగణంలో శుక్రవారం ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య క్రీడాజ్యోతి వెలిగించి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలు షురూ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఉట్నూర్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్ డివిజన్‌లోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలోని 112, నిర్మల్ జిల్లాలోని 19 పాఠశాలల చెందిన 305 మంది విద్యార్థులు, 305 విద్యార్థినులు మొ త్తం 610 మంది పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈనెల 27 నుంచి 29 వరకు ఉట్నూర్ కేం ద్రంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ఆదర్శ క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రీడలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు నగదు ప్రోత్సహాకాలు ఉంటాయన్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో విజేతలుగా నిలుస్తున్న కొ లాం ఆశ్రమ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులను అభినందించి హాకీ కర్రలు, ట్రాక్ సూట్‌లు అందించారు. కార్యక్రమంలో ఏటీడీవోలు చంద్రమోహన్, సౌజన్య, ఏసీఎంఓ జగన్, డీఈ తానాజీ, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, భూక్య రమేశ్, ప్రధానోపాధ్యాయులు చందన్, నారాయణ్‌రావు, కృష్ణారావు, ఉత్తందాస్, భోజన్న, ఉత్తం, విఠల్, హేమంత్, శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడలకు ఆరు జట్లు..
ఉట్నూర్ కేంద్రంగా త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలకు సుమారు 6 టీంలు రానున్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి ఆదిలాబాద్, నిర్మల్‌ను ఒక టీంగా, మంచిర్యాల్,ఆసిఫాబాద్‌ను మరో టీంగా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో విభాగంలో ఒక్కో టీం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles