ధ్రువపత్రాలు పకడ్బందీగా పరిశీలించాలి

Sun,November 10, 2019 12:23 AM

జైనూర్ : టీఆర్టీలో ఎంపికైన అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు పకడ్బందీగా పరిశీలించాలని ఆదివాసీ సమన్వయ సమితి మూడు మండలాల (జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్) అధ్యక్షుడు కుమ్ర ధుందేరావ్ కోరారు. సంఘం సభ్యులతో కలిసి శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్టీ ఉపాధ్యాయ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 15వ తేదీన డీటీడీవో కార్యాలయంలో ఉందని గుర్తు చేశారు. కొంత మంది బోగస్ పత్రాలు సమర్పించి, ఏజెన్సీ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగాలు పొందిన సంఘటనలు లేకపోలేదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులతో పాటు మూడు మండలాల నుంచి సర్పంచులు, నాయకులున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles