ఇంకొందరికీ ఆసరా..

Sun,November 10, 2019 12:26 AM

-పెన్షన్ అదాలత్‌లకు అనూహ్య స్పందన
-కొత్త పింఛన్ల కోసం వెల్లువలా దరఖాస్తులు
- జిల్లా వ్యాప్తంగా వచ్చినవి 3,806
- అర్హులను గుర్తించే పనిలో అధికారులు
- ఇప్పటికే 50,753 మందికి ప్రయోజనం
- ప్రతి నెలా రూ. 6.37 కోట్లు పంపిణీ
- మరింత పెరుగున్న వ్యయం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కొండంత అండగా నిలుస్తున్నది. వయసు పైబడి తమ పనులు తాము చేసుకోలేక.. కుటుంబ సభ్యు ల నిర్లక్ష్యానికి గురైన వారికి సర్కారు ఎంతో ధైర్యాన్నిస్తున్నది. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌దారులు 19,777 మంది, వితంతువులు 20, 678 మంది, వికలాంగులు 6,588 మంది, చేనేత కార్మికులు 486 మంది, గీత కార్మికులు 127 మంది, బోధకాలుగ్రస్తులు 446 మంది, బీడీ కార్మికులు 83 మంది, ఒంటరి మహిళలు 2,568 మంది ఉ న్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 6 కో ట్ల 37 లక్షల 10 వేలు పంపిణీ చేస్తున్నది. ఇక కొ త్తగా స్వీకరించిన దరఖాస్తులతో లబ్ధిదారుల సం ఖ్య మరింత పెరగనున్నది. దివ్యాంగులకు రూ 30 16 పింఛన్ వస్తుండడంతో మిగతా అర్హులందరు పెన్షన్లకోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు పెట్టుకున్నారు.

కొత్తగా 3,806 దరఖాస్తులు...
ప్రభుత్వం గత జూలై నుంచి పింఛన్ రెట్టింపు చేసిం ది. వికలాంగులకు రూ. 3016, ఇతర పింఛన్ దా రులకు రూ. 2016 చొప్పున అందిస్తుండగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ప్రత్యేక అదాలత్‌ల ద్వారా అర్జీలను స్వీకరించింది. దీంతో జిల్లాలోని ప్రతి మండలం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆసిఫాబాద్ మండలంలో 162, బెజ్జూర్ మండలంలో 170, చింతలమానేపల్లిలో 297, దహెగాంలో 27 4, జైనూర్‌లో 55, కాగజ్‌నగర్ రూరల్‌లో 515, కాగజ్‌నగర్ అర్బన్‌లో 526, కెరమెరిలో 223, కౌ టాలలో 270, లింగాపూర్‌లో 101, పెంచికల్‌పేట్ 207, రెబ్బెనలో 216, సిర్పూర్-టిలో 272, సి ర్పూర్-యులో 135, తిర్యాణిలో 219, వాంకిడి లో 164 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.

పాతవి పరిష్కారం..
కొత్త దరఖాస్తులతో పాటు పెన్షన్‌లు సరిగా రాక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు సైతం పరిష్కారం కానున్నాయి. గతంలో పెన్షన్ వచ్చి.. ప్రస్తుతం రాని వారు 144 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 65 ఏళ్ల పైబడిన వారు 1664 మం ది, సదరం సర్టిఫికెట్ ఉండి పెన్షన్ రాని వారు 339 మంది, వితంతు పింఛన్ కోసం 589 మంది, ఒంటరి మహిళలు 230 మంది, చేనేత, బీడీ, కార్మికులు 59 మంది, నెట్ సమస్యల కారణంగా పింఛన్ రాని వారు 68 మంది, వికలాంగుల సర్టిఫికెట్ వ్యాలిడిటీ ముగిసిన అర్హులైన వారు (ఎముకలకు సంబంధించి) 336 మంది, కంటిచూపు లేనివారు 117 మంది, మానసిక వైకల్యం కలవారు 67 మంది, మూగ, చెవిటి వారు 193 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెన్షన్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం త్వరలో పెన్షన్‌లు మంజూరు చేయనున్నది.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles