రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలు షురూ..

Mon,November 11, 2019 01:09 AM

ఎదులాపురం : ఆదిలాబాద్ జిల్లాకేంద్రం న్యూహౌజింగ్‌బోర్డులోని మహాత్మజ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో 65వ రాష్ట్రస్థాయి అండర్-17,19 బాలబాలికల టార్గెట్ బాల్ పోటీలు ఆదివారం షురూ అయ్యాయి. ఎస్‌జీఎఫ్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి 400ల మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందనీ, రాష్ట్ర,జాతీయ స్థాయి రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె.రాజన్న, మావల ఎంపీపీ చందాల ఈశ్వరి, మావల జడ్పీటీసీ నల్లవనిత రాజేశ్వర్, మావల సర్పంచ్ దొగ్గిలి ప్రమీళ, ఏఎంసీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్దన్‌పేట సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థశారథి, పీ కృష్ణ, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ గుండి మహేశ్, బీసీ గురుకులాల ఆర్సీవో గోపిచంద్ రాథోడ్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతిభ, టీటీ సంఘం అధ్యక్షుడు రాష్ట్రపాల్, పోటీల కన్వీనర్ స్వామి, పీఈటీలు, పీడీలు కృష్ణ, సత్యనారాయణగౌడ్, రేణుకా, జ్యోతి, సంగీత, సాయికుమార్, హరిచరణ్, రాకేశ్ తదితరులు ఉన్నారు.

తొలి రోజు హోరాహోరీ..
మొదటి రోజు టార్గెట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. అండర్-19 బాలుర విభాగంలో రంగారెడ్డి, ఖమ్మం తలపడగా 2-0తో రంగారెడ్డి విజయం సాధించింది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ మధ్య పోటీలు జరగగా.. 0-2తో ఆదిలాబాద్ జట్టు గెలుపొందింది.

బాలికల విభాగంలో..
రంగారెడ్డి, నల్గొండ తలపడగా 0-0తో మ్యాచ్ డ్రా అయింది. కరీంనగర్, ఖమ్మం మధ్య 0-3తో ఖమ్మం జట్టు , నిజామాబాద్, వరంగల్ మధ్య 3-2తో నిజామాబాద్ గెలుపొందింది. ఆదిలాబాద్, ఖమ్మంల మధ్య 2-5తో ఖమ్మం విజయాన్ని కైవసం చేసుకుంది. రంగారెడ్డి, నిజామాబాద్ మధ్య 2-3తో నిజామాబాద్ గెలుపొందింది. నల్గొండ, వరంగల్ 3-5తో వరంగల్ విజయం సాధించింది.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles