ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి

Tue,November 12, 2019 02:52 AM

ఆసిఫాబాద్ టౌన్ : 100 నంబర్‌కు కాల్‌వస్తే సత్వరమే స్పందించి, సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయాలని బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బందికి ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. విధుల్లో అప్రమత్తంగా ఉం డాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్య పరిష్కరించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టి తీసుకువెళ్లాలని సూచించారు. పాయింట్ బుక్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నా రు. అనుమానస్పందంగా సంచరించే వ్యక్తుల ఫింగర్ ప్రింట్ స్కాన్, మొబైల్ సెక్యూరిటీ డివైజ్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా క్షుణ్నంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ విధులు నిర్వహించడంలో బ్లూ కోట్స్ పాత్ర చాలా కీలకమన్నారు. ఏఎస్‌ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఐటీ కోర్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ,ఆర్‌ఐ శేఖర్‌బాబు, ఐటీ కోర్ సభ్యులు రాజేంధర్,లింగమూర్తి ,పీఆర్వో శ్రవన్‌కుమార్ తదితరులున్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles