సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

Tue,November 12, 2019 02:52 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వచ్చి అర్జీలు సమర్పిస్తారనీ, వాటి పరిష్కారానికి కృషిచేయాలని అధికారులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులకు న్యాయం చేసేందుకు కృషిచేయాలన్నారు. ఆసిఫాబాద్‌కు చెందిన లక్ష్మయ్య, తన ఇంటిని మనువడు ఆక్రమించుకున్నాడనీ, తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. కాగజ్‌నగర్ మండలం నజరుల్లానగర్‌కు చెందిన మాజీ సర్పంచ్, జడ్పీ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన నిధులు మంజురు చేయాలని కోరారు. ఎక్కవగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సిడాం దత్తు, జిల్లా అధికారులు, తదితరులున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles