గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Tue,November 12, 2019 02:53 AM

రెబ్బెన: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నక్కలగూడ, రాంపూర్ గ్రామాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, గోలేటిలో సర్పంచ్ పొటు సుమలత, కైర్‌గూడలో సర్పంచ్ అజ్మీర సంధ్యరాణి, నారాయణపూర్‌లో సర్పంచ్ అమృత వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామంలో వీటిని నిర్మించాలని నిధులు మంజూరు చేసిందన్నారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, సర్పంచులు జగన్నాథం, దుర్గం రాజ్యలక్ష్మి, ఉపసర్పంచులు బోదాసు దేవానంద్, సంతోశ్, మదాసు రవీందర్, కార్యదర్శి శం కర్, మహేశ్, కారోబార్ సుధాకర్, వసంతరావు, ఎంపీటీసీలు దుర్గం శ్రీవాణి, దోమల సంధ్యరాణి, రాము, ఎపీవో కల్పన, ప్రత్యేక అధికారి రవికుమార్, మండల కోఆప్షన్‌సభ్యుడు జౌరోద్దీన్, వార్డు సభ్యులు దుర్గం తిరుపతి, బానోత్ కవిత, సత్యనారాయణ, రవి, పల్లె శ్రీనివాస్, రాజయ్య, నాయకులు అజ్మీర ఆత్మరాంనాయక్, జుమ్మిడి ఆనందరావు, దుర్గం తిరుపతి, దాసరి సాంబగౌడ్, దుర్గం రవీందర్, కిషన్, తుకారం, సక్రునాయక్, అరవింద్ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles