పెసా చట్టంపై అవగాహన ఉండాలి

Sun,November 17, 2019 12:18 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: రాజ్యాంగం ప్రకారం కల్పించిన చ ట్టాలపై గిరిజనులు అవగాహన కలిగి ఉండాలని ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య తెలిపారు. స్థానిక కొమురంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని రాయిసెంటర్ల సర్‌మేడీలకు, గ్రామ పటేళ్లకు, ట్రైబల్ లీడర్లకు పీసా చట్టం ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు, సమన్యయ కర్తల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసా చట్టం ప్రకారం గిరిజనులె గ్రామాల్లో ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయన్నారు. వాటిని ఈ సమావేశం ద్వారా అర్థం చేసుకొని గ్రామాల అభివృద్ధితో పాటు స్వీయ అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చా రు. అనంతరం పెసా చట్టం ప్రకారం గిరిజనులకు కలిగి ఉన్న హక్కులు, విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ చందన, పెసా రిసొర్స్ పర్సన్ అలీం, జిల్లా సమన్వయ కర్తలు వెడ్మ బొజ్జు, పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles