అమ్మే గెలిచింది

Sun,July 7, 2019 01:40 AM

ఎంజీఎం, జూలై 06 : ఆ పాప నా కూతురే..! శీర్షికన ఈ నెల 2న నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై విచారణ చేపట్టిన చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ మండల పరశురాములు వాస్తవాలను గుర్తించి శనివారం సాయంత్రం పాప తల్లితో చర్చించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బం గ్లాకు చెందిన కే. సోని పది రోజుల క్రితం వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి దవాఖానలో కూతురికి జన్మనిచ్చింది. పాప తక్కువ బరువుతో పుట్టడడంతో బిడ్డతో పాటు తల్లి సోనిని ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఫిమేల్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న సోని పక్క నే మరో బెడ్‌పై పేషంట్‌గా ఉన్న ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన ఖమ్రూన్ పాప కావాలనుకుంది. తనకు ఇద్దరు కుమారులు కావడంతో పాప కోసం పరితపించింది. మీ పాపను తనకు ఇస్తే పెంచుకుంటానని సోనితోపాటు ఆమె తల్లి సుశీలకు చెప్పుకుంది. దీనికి వారు అభ్యంతరం తెలిపారు. ఈ నేపధ్యంలో పాపను పిల్లల వార్డులో చేర్పించే క్రమంలో ఆ పాప తమ కూతురని ఆమెకు పేరును కూడా ఖరారు చేస్తూ పిల్లల వార్డులో చేర్పించింది. ఈ విషయం పై నమస్తేతెలంగాణలో కథనం రావడంతో స్పందించిన స్థానిక పోలీసులు, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ సిబ్బంది ఇరు వర్గాలను విచారణ నిమిత్తం వారి కార్యాలయానికి రప్పించారు. చైర్ పర్సన్ మండల పరశురాములు, సభ్యురాలు కొండ మంజుల ఇరు వర్గాలకు శనివారం కౌన్సెలింగ్ ఇవ్వడంతో జరిగిన దానికి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తాము చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో అంగీకార పత్రాన్ని రాయించి సంతకాలు తీసుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది.

సోనికి పాపను అప్పగిస్తాం
ధర్మసాగర్ సాయిపేటకు చెందిన దంపతులు ఖమ్రూన్ అలీ సోని కూతురిని తమ కూతురుగా భావించడం లేదని సీడబ్ల్యూసీ సిబ్బంది ముందు ఒప్పుకుందని చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ పరశురాములు తెలిపారు. ఇరువర్గాలు రాయించిన ఒప్పంద ప్రతులను దవాఖాన అధికార వర్గాలకు ఇవ్వడంతో ఆదివారం పాపను సోనికి అప్పగిస్తారని తెలిపారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles