ఆ కాలనీలో పదిహేనేళ్లకు మంచినీటి నల్లా

Thu,July 11, 2019 05:31 AM

కురవి, జూలై 10 : కురవి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత ఎస్సీకాలనీలో ఉన్న నల్లాలు 15ఏళ్ల తర్వాత వాడుకలోకి వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత నల్లాల నుంచి నీళ్లు రావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వెళ్లే తాగునీరు పైప్‌లైన్ 15ఏళ్ల క్రితం పూర్తిగా జామ్ అయ్యింది. ఈ కాలంలో ముగ్గురు సర్పంచ్‌లు తమ పదవీకాలం ముగించుకొని వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ కూడా కాలనీ సమస్యను పట్టించుకోలేదు. ఈ సారి ఎన్నికల సమయంలో కాలనీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ నూతక్కి పద్మానర్సింహారావు పైపులైన్ మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల మన్ననలు అందుకున్నారు. బుధవారం పైపులైన్ల ద్వారా నీరు సులభంగా సరఫరా కావడంతో పాత ఎస్సీ కాలనీవాసులు ఆనందంవ్యక్తం చేశారు.

రోడ్డు పనులు ప్రారంభం..
కురవి ఎంపీడీవో కార్యాలయం నుంచి కాట్యాల గొల్లబజారు వరకు ఉన్న రోడ్డును తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు కురవి సర్పంచ్ నూతక్కి పద్మానర్సింహారావు బుధవారం పనులను ప్రారంభించారు. గతంలో ఈ రోడ్డు వాడుకలో ఉండేదని, నీరు నిల్వ ఉండడం వల్ల బురదమయంగా మారడంతో దీనిని బంద్ చేశారు. దీని వల్ల గొల్లబజారు నుంచి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఇటీవల జరిగిన గ్రామసభలో ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ రోడ్డును వాడుకలో తేవాలని తీర్మాణం చేసి, పనులను ప్రారంభించారు. అంతేకాకుండా ముత్యాలమ్మ కుంట వరకు గ్రామం నుంచి వెళ్లే కాల్వను పునరుద్ధరించనున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్ సంగెం భరత్, వార్డు సభ్యులు నూతక్కి నర్సింహారావు, నూతక్కి సాంబశివరావు, ఆమెడ మల్లిఖార్జున్, కర్నం ప్రసాద్, తోట వెంకన్న, దడిగెల బింధు, తోట వెంకన్న, బాదె నాగయ్య, పిడిమర్తి రమణ, సిబ్బంది నర్సయ్య, సంతోష్, అప్పాల రాజు, రవి పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles