నాణ్యమైన విద్యుత్ ఘనత కేసీఆర్‌దే..

Thu,July 11, 2019 05:33 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జులై 10: వ్యవసాయ, గృహ తదితర అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. డివిజన్ కేంద్రంలో రూ.30లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. విద్యుత్ అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కేఎం గుట్ట, డీఈఈ శ్రీధరాచారి, ఏడీఈ కిశోర్, సీనియర్ అకౌంట్ అధికారులు సంతోశ్, హరినాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యుత్‌శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles