కష్టపడ్డ వారికే గుర్తింపు....

Sun,July 14, 2019 01:52 AM

పాలకుర్తి రూరల్ జూలై 13: పాలకుర్తి నియోజకవర్గంలో 75వేల సభ్యత్వ నమోదే లక్ష్యంగా పార్టీ శ్రేణు లు పని చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామ్యూల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావుతో కలిసి సభ్యత్వ నమోదుపై నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పాలకుర్తిని ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. ఈ నెల 15వ తేదీలోపు సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. నియోజక వర్గంలోని ప్రతి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అందుకోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు. పార్టీకి అధ్యక్షులే సుప్రీం అన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీఇచ్చారు. రాయపర్తి పెద్ద వంగర మండలాల్లో సభ్యత్వ నమోదును పెంచాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 50వేల సభ్యత్వ నమోదు పూర్తయిందన్నారు. మరో 25వేల సభ్యత్వాన్ని మంగళవారంలోపు పూర్తి చేయాలన్నారు. పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషిచేసి,న రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలువాలన్నా రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రజా ప్రతినిధులు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.

గ్రామాల్లో హరితహారం ఇంకుడు గుంతలను పూర్తి చేయాలన్నారు. ఆనంతరం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామ్యూల్ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ను పూర్తి చేసి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలన్నారు. సభ్యత్వ నమోదులో పాలకుర్తి రాష్ర్టానికి దిక్సూచిగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పాలకుర్తి ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానం లో ఉందన్నారు. కార్యకర్తలు నాయకులు కష్టపడి సభ్యత్వ నమోదును పూర్తిచేసి, మంత్రి ఎర్రబెల్లి పేరును నిలపాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ దారవత్ మోహన్‌గాంధీ నాయక్, నియోజకవర్గ పరిశీలకుడు జన్ను జకారియా, దేవస్థానం చైర్మన్ వి రాంచంద్రయ్యశర్మ, గుడిపుడి గోపాల్‌రావు, మధుకర్‌రావు, సాంబయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, వసుమర్తి సీతారాములు, నర్సింహనాయక్, తీగల దయాకర్, ఈదూరు ఐలయ్య, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, బస్వ మల్లేశం, జ్యోతి, తూర్పాటి చిన్న ఆంజయ్య, కొత్త జలేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, కేలోతు సత్తమ్మ, మంగళంపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్‌కుమార్, రంగు కుమార్, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, పీ సోమేశ్వర్‌రావు, ఈ నర్సింహారెడ్డి, మేకపోతుల ఆంజనేయులు, చింత రవి పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles