అభివృద్ధిలో జెట్‌ స్పీడ్‌తో దూసుకువెళ్తాం..

Mon,July 15, 2019 01:12 AM

గూడూరు : అభివృద్ధిలో జెట్‌స్పీడ్‌తో దూసుకువెళ్తామని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. ఆదివారం మండలంలోని మట్టెవాడ, భూపతిపేట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. సీఎం స్ఫూర్తితో తామిద్దరం నియోజవర్గంలో అభివృద్ధి పనులను పోటీ పడీ మరీ చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణ జీవనధారగా నమోదవుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు నిండితే అన్నారం, సుందిళ్ల, మిడ్‌మానేరు, దేవాదుల, పాకాలకు నీరు చేరి, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని వివరించారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయల పనుల జరిగాయన్నారు. అభివృద్ధే పనులే తమకు శ్రీరామ రక్షలాగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉండేలా ప్రజలకు రుణపడి పనిచేస్తామని అన్నారు. మండలంలో పోడు భూముల సమస్య ఎక్కువగా ఉందని ఈ సమస్యలను సీఎం కేసీఆర్‌ రెవెన్యూ, అటవీశాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మండలంలోని మట్టెవాడ గ్రామం నుంచి పీడబ్ల్యూ రోడ్‌ మీదుగా నేలవంచ వరకు రూ.2.05కోట్లతో, కొంగరగిద్ద గ్రామం నుంచి మట్టెవాడ గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్‌లను ప్రారంభించారు. ఊట్ల గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, భూపతిపేట గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకుడు భీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సుచిత్ర, ఎంపీపీ సుజాత, జెడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖాసీం, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు నాయిని ధర్మారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేం వెంకటకృష్ణారరెడ్డి, నాయకులు సంపత్‌రావు, సర్పంచ్‌ ముక్కా లక్ష్మణ్‌రావు, సురేందర్‌, ఏదునూరి వెంకన్న, పెద్దకాసు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles